కెబిఆర్ పార్క్ వద్ద నటిపై దుండగుడి దాడి
హైదరాబాద్ (): నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ నటిపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్ నంబర్ 9 వద్ద నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి ఆమె సెల్ ఫోన్ లాక్కెల్లాడు. దుండగుడితో పెనుగులాడే క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. అనంతరం ఆమె డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన చౌరాసియాను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్ వెళ్లగా జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.