Nalgonda: ఈ నెల 26న మెగా జాబ్‌మేళా..

న‌ల్గొండ (CLiC2NEWS): ఉద్యోగాల‌కోసం ఎదురుచూస్తున్న వారికి స‌దావ‌కాశం. ఈ నెల 26వ తేదీన న‌ల్గొండ జిల్లాలో 100కుపైగా కంపెనీలు మెగా జాబ్‌మేళాను నిర్వ‌హించ‌నున్నాయి. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న వెల్ల‌డించారు. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జాబ్ మేళా నిర్వ‌హిస్తారు. 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. ఎస్ఎస్‌సి, ఐటిఐ, ఇంట‌ర్‌, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పిజి అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు త‌మ అర్హ‌త‌కు సంబంధించిన ప‌త్రాలు తీసుకొని రావాల‌ని తెలిపారు. తెలంగాణ ఫెసిలిటి మేనేజ్‌మెంట్ కౌన్సెల్ , తెలంగాణ అకాడ‌మి ఫ‌ర్ స్కిల్ అండ్ మేనేజ్‌మెంట్ స‌హ‌కారంతో కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ రెడ్డి పౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ జాబ్ మేళా నిర్వ‌హిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.