భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: పసిడి ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం మళ్లీ భారీగా తగ్గింది. బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి కదలడంతో బులియన్ మార్కెట్‌పై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 44,840 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 41,100 కు చేరింది. ఇక వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. కిలో వెండి ధర రూ.1200 తగ్గి రూ. 67,300 వద్ద కొనసాగుతోంది.